Medical Seats: మెడికల్ పీజీ సీట్ల భర్తీకి ఐచ్ఛికాలు... 29 d ago
రాష్ట్రంలోని ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో ప్రస్తుత విద్యా సంవత్సరానికి అందుబాటులో ఉన్న పీజీ మెడికల్ డిగ్రీ/డిప్లొమా కోర్సుల కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి ఆప్షన్స్ పెట్టుకోవాలని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం ప్రకటన జారీ చేసింది. యూనివర్సిటీకి దరఖాస్తు చేసుకున్న 4527 మంది నాన్ సర్వీస్ అభ్యర్ధులు, 183 మంది, సర్వీస్ అభ్యర్ధుల చివరి విడత జాబితాను వెల్లడించారు. అభ్యర్ధులు ఈ నెల 22 వ తేదీ రాత్రి 7 గంటల నుంచి 24వ తేదీ రాత్రి 7 గంటల లోపు ఐచ్చికాలు పెట్టుకోవలసి ఉంటుందని యూనివర్సిటీ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 27వ తేదీలోగా సీట్లు కేటాయిస్తారని విశ్వవిద్యాలయ వర్గాలు పేర్కొన్నాయి.